ముగిసిన జిమ్నాస్టిక్స్‌ పోటీలు

Concluded Gymnastics Competitionsహైదరాబాద్‌ : ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ పోటీలు ముగిశాయి. శనివారం హైదరాబాద్‌లోని ఏబీ జిమ్నాస్టిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన పోటీల్లో రాకర్జ్‌ జిమ్నాస్టిక్స్‌ అకాడమీ అథ్లెట్లు సత్తా చాటారు. బాలురు, బాలికల విభాగంలో మెడల్స్‌ స్వీప్‌ చేసిన జిమ్నాస్ట్‌లను డైరెక్టర్లు డెవిడ్‌, దీపికలు అభినం దించారు. బాంద్ర ఆనంద్‌, ఆమర్య, సూర్యాంశు, నందన్‌, విదార్థి, అద్వైత, విదార్థి వర్మ, ఆర్ణవ్‌, సమీక్ష వ్యాస్‌, సన్నధి, నవీ సూర్యవంశిలు ఆయా విభాగాల్లో పసిడి పతకాలు దక్కించుకున్నారు. తెలంగాణ జిమ్నా స్టిక్స్‌ సంఘం కార్యదర్శి సోమేశ్వర్‌ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.