ముగిసిన ఇంటర్ ప్రధాన పరీక్షలు..

– మరో రెండు రోజులు ఒకేషనల్ పరీక్షలు….
– మూడు కేంద్రాల పరిధిలో 30 మంది గైర్హాజర్…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు గురువారానికి  పన్నెండో రోజు కు చేరాయి.ఆద్యంతం ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా ప్రశాంతంగా ప్రధాన పరీక్షలు ముగిసాయి. రెండు సార్లు ఫ్లైయింగ్ స్కాడ్ లు పరీక్షా కేంద్రాలను సందర్శించారు.  నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం జూనియర్,టి.ఎం.ఆర్,వీకేడీవీఎస్ ఆర్ జూనియర్ కళాశాలల్లో నీ మూడు పరీక్షా కేంద్రాల పరిధిలో ద్వితీయ సంవత్సరం రసాయన శాస్త్రం,కామర్స్ 2  పరీక్షల లో మొత్తం 832 మంది విద్యార్ధులు పరీక్షలు రాయాల్సి ఉండగా,802 మంది విధ్యార్ధులు పరీక్షలకు హాజరు అయ్యారు.30 మంది విద్యార్ధులు గైర్హాజరు అయ్యారు.తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,సీఐ జితేందర్,ఎస్.హెచ్.ఒ ఎస్ఐ లు శ్రీను,శివరామక్రిష్ణ లు బందోబస్తు ను పర్యవేక్షించారు. ఈ పరీక్షా కేంద్రాలకు చీప్ సూపరింటెండెంట్,డిపార్ట్మెంట్ ఆఫీసర్ లుగా దామెర నరసింహారావు,అలవాల వెంకటేశ్వరరావు,కాటిబోయిన రామయ్య,ఝాన్సీ,యేశోబు,ఎల్.శివప్రసాద్ లు విధులు నిర్వహిస్తున్నారు.
కేంద్రం                     ఎలాట్మెంట్     ఆబ్సెంట్    ప్రజెంట్ 
జి.జేసి                      393            369         24
టిఎం ఆర్ జేసీ           175            172         03
వీకేడీవీఎస్ఆర్ జేసీ      264            261         03
మొత్తం                    832            802         30