ముగిసిన ఎస్‌బిఐ జాతీయ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌

హైదరాబాద్‌: ఆల్‌ ఇండియా ఎస్‌బిఐ ఇంటర్‌ సర్కిల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఘనంగా ముగిసింది. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఐదు రోజుల పాటు సాగిన పోటీల ముగింపు కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం నిర్వ హించారు. విజేతలకు బహుమ తులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథితు లుగా ఎస్‌బిఐ ముంబయి కార్పొరేట్‌ సెంటర్‌ సిడిఒ అండ్‌ డిఎండి (హెచ్‌ఆర్‌) ఒపి మిశ్రా, హైదరా బాద్‌ సర్కిల్‌ సిజిఎం రాజేష్‌ కుమార్‌, అమరావతి సర్కిల్‌ సిజిఎం నవీన్‌ చంద్ర ఝా హాజ రయ్యారు. ఎస్‌బిఐ బెంగళూరు సర్కిల్‌ మెరుగైన ప్రతిభను కనబర్చి అగ్రస్థానం లో నిలిచింది. రన్నరప్‌గా హైద రాబాద్‌ సర్కిల్‌ బృందం నిలి చింది. మొత్తం టర్నోమెంట్‌ కాంపిటీటివ్‌ స్పిరిట్‌తో జరిగిం దని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజు అద్బుతమైన డ్యాన్స్‌, ఇతర కల్చరల్‌ కార్యక్ర మాలతో టోర్నీని ముగించారు.