– తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ నూతన కార్యవర్గం ఎన్నిక
నవతెలంగాణ-భగత్ నగర్ : తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు కరీంనగర్) జిల్లా జనరల్ బాడీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కే. ఈశ్వర్ రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నలువాల స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు, జూనియర్ లైన్ మేన్స్, అన్ మ్యాన్డ్, ఆర్టిజన్స్, మీటర్ రీడర్స్, బిల్ కలెక్టర్, ఎస్పీఎం వర్కర్స్, తదితర కేటగిరిలో పనిచేస్తున్న కార్మిక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందనీ అన్నారు.
తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ నూతన కార్యవర్గం ఎన్నిక
సమావేశం అనంతరం నిర్వహించిన తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికలో జిల్లా అధ్యక్షులుగా నల్వాల స్వామి ,కార్యదర్శిగా ఆర్ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమర్ అలీ ,ఉపాధ్యక్షులుగా సంతోష్ లక్ష్మీనారాయణ గాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా దుర్గారాం, ప్రసాద్, సతీష్ నాయక్, ఎం రాజేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా నరసింగం, మహేందర్, ఉత్తం రాజు లు ఎన్నికైనట్లు తెలిపారు. సమావేశంలో కంపెనీ నాయకులు రామచంద్రనాయక్, కనకయ్య కరుణాల అనిల్, కుమార్, జిల్లా కార్యదర్శి ఏ. తిరుపతి ,టౌన్ డివిజన్ ప్రెసిడెంట్ ఆర్ శ్రీనివాస్, టౌన్ డివిజన్ సెక్రెటరీ శ్రీకాంత్, రూరల్ డివిజన్ సెక్రెటరీ నౌసి లాల్ ,రూరల్ డివిజన్ ప్రెసిడెంట్ బొంగోని శివ, సిఐటియు బాధ్యులు రాజేశం ,కమిటీ సభ్యులు పాల్గొన్నారు.