ఆల్ ఫోర్స్ నరేంద్ర పాఠశాలలో రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం

నవతెలంగాణ -ఆర్మూర్ 
రాష్ట్ర స్థాయి  42 వ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ బాల బాలికల క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం సోమవారం పట్టణంలోని ఆల్ ఫోర్స్ నరేంద్ర పాఠశాలలో జరిగింది. ఈ ముగింపు కార్యక్రమానికి బాల్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షులు  మానస గణేష్ అధ్యక్షత వహించారు.  నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది  క్రీడల ద్వారా శారీరకంగా మానసికంగా ఎదుగుదల ఉంటుందని  క్రీడల ద్వారా ఎంతో మంది క్రీడాకారులు ఉన్నత స్థానంలో ఉన్నారని వారు క్రీడాకారులనుద్దేశించి మాట్లాడటం జరిగింది. తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్  ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో  గత నాలుగు సంవత్సరాలలో 7 సార్లు రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్  క్రీడా పోటీలు నిర్వహించడం అది ఆర్మూర్లోనే నిర్వహించడంపై నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘాన్ని అభినందించడం జరిగింది.జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు గెలుపొందాలని  క్రీడాకారులకు తెలిపారు. తరువాత విజేతలకు బహుమతులను ప్రదానం చేయడం జరిగింది. బాలుర విభాగంలో ప్రథమ నిజామాబాదు జిల్లా జట్టు స్థానం, ద్వితీయస్థానం కరీంనగర్ జిల్లా జట్టు,  తృతీయస్థానం ఆదిలాబాద్ జిల్లా జట్టు , రంగారెడ్డి జిల్లా జట్టు నాలుగవ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో ప్రథమ స్థానం ఖమ్మం జిల్లా జట్టు, ద్వితీయ నిజామాబాదు జిల్లా జట్టు,తృతీయ స్థానం మెదక్ జిల్లా జట్టు, వరంగల్ జిల్లా జట్టు నాలుగో స్థానం లో నిలిచాయి,  ఈ కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి  ఏం.రవీందర్ గౌడ్ మాట్లాడుతూ  42వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్  క్రీడా పోటీలు  అక్టోబర్ 15 తేదీ నుండి19 వ తేదీ వరకు చత్తీస్గడ్ లోని బిలాయిలో నిర్వహించడం జరుగుతుందని   తెలిపారు  .  ఈ ముగింపు కార్యక్రమంలో   మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నాభాయ్, జిల్లా వ్యామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు టీ విద్యాసాగర్ రెడ్డి, కోశాధికారి ఎం.రాజేందర్, బాల్ బ్యాడ్మింటన్ సంగం కోశాధికారి రాజేశ్వర్  , ఆర్గనైజింగ్ సెక్రెటరీ కృష్ణమూర్తి, సంఘ సభ్యులు పింజ సురేందర్, గట్టడి రాజేష్,  కౌన్సిలర్లు బారాడ్ రమేష్, ప్రసాద్,  హనుమంతు,  టిఆర్ఎస్ పార్టీ నాయకులు పండిత్ ప్రేమ్ వ్యాయామ ఉపాధ్యాయులు నాగేష్,మాధురీ ,రమణ, నరేందర్,  సురేష్, సునీత, దేవ సుకన్య,భాగ్య, నికిత, నరేంద్ర చారి,సంతోష్ టాగూర్, చిన్నయ్య ,నాగేశ్,   స్థానిక పాఠశాల పీఈటి  హరీష్, బలరాం తదితరులు పాల్గొన్నారు..