ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడి నీ ఖండించండి

బీవీపీ మతోన్మాద గుండాల దిష్టిబొమ్మను దగ్ధం
నవ తెలంగాణ- కంటేశ్వర్: ఏబీవీపీ మతోన్మాద గుండాలు సంగారెడ్డి ఎస్ఎఫ్ఐ నాయకుల పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నిజామాబాద్ ఎస్ ఎఫ్ ఐ నాయక్ లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ ఖండిస్తూ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక నాందేవ్వాడలో ఏబీవీపీ గుండాల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బొడ అనిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ఈనెల 8 9 10 తేదీల్లో జరిగే తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశాల సందర్భంగా నిన్న రాత్రి సంగారెడ్డి లో ఎస్ఎఫ్ఐ నాయకత్వం తోరణాలు, జెండాలు కడుతున్న సమయంలో ఏబీవీపీ గుండాలు అర్ధరాత్రి వచ్చి దాడి చేసి జిల్లా కార్యదర్శి రమేష్ తల పై మరియు జిల్లా నాయకత్వం పై తీవ్రంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తల పగలగొట్టడం జరిగింది. ఏబీవీపీ గుండాలకు సైదాంతికంగా ఎదుర్కొనే దమ్ము లేక ఎస్ఎఫ్ఐ చేస్తున్నటు వంటి కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక ఎస్ఎఫ్ఐ కార్యక్రమాలు ఎక్కడ జరిగిన ఏబీవీపీ గుండాలు ఎస్ఎఫ్ఐ నాయకత్వం పై దాడి చేయడం సిగ్గుచేటు నిరంతరం విద్యార్థుల కోసం పనిచేసే ఎస్ఎఫ్ఐ నాయకత్వంపై దాడి చేయడాన్నీ దారుణంగా ఖండించడం జరిగింది. దాడికి పాల్పడిన వాళ్లందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ నగర కార్యదర్శి పి.మహేష్, నాయకులు సాయి, ప్రసాద్, బాపురావు, నవీన్, కార్తీక్ కోటేష్ రాజేష్ పాల్గొన్నారు.