– ప్రజాస్వామ్య దేశంలో వాక్, స్వాతంత్ర్యపు స్వేచ్ఛను కాపాడలేని స్థితిలో ప్రభుత్వాలు.
– ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలి.
– టీపిఎఫ్ హైదరాబాద్ జిల్లా కో – కన్వినర్ రాంబాబు.
నవతెలంగాణ – హైదరాబాద్
ఫ్రీ లాన్సర్ జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ హత్య దోపిడీదారుల పనేనని, ఆయా హత్యకు కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని నిరసిస్తూ ఈరోజు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ప్రజా ఫ్రంట్ హైదరాబాద్ జిల్లా కో కన్వీనర్ కడమంచి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ ముత్తన్న మాట్లాడుతూ… ఛత్తిస్ఘడ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా ప్రాంతానికి చెందిన ముఖేష్ చంద్రకర్ ‘బస్తర్ జంక్షన్’ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ను నడిపిస్తూ ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ గా అక్కడి ప్రజలకు సేవలందిస్తూ ఆయా ప్రాంతంలో ఆదివాసులపై జరుగుతున్న దాడులను, ప్రభుత్వాలు, కాంట్రాక్టర్లు చేస్తున్న అవినీతి, అక్రమ దోపిడీనీ వెలికితిస్తూన్న క్రమంలో కాంట్రాక్టర్లు అతనిపై కుట్రపన్ని ఈనెల ఒకటో తారీఖున ఆయనను అతి కిరాతకంగా చంపి అక్రమాలకు పాల్పడిన గుత్తేదారు తన యొక్క ఫామ్ హౌస్ లోని సెప్టిక్ ట్యాంక్ లో పడి వేయడం జరిగింది. ఇలా ప్రశ్నించిన వారిపై, వారి అక్రమాలను వెలికి తీసిన జర్నలిస్టులపై పాషవికంగా దాడులు చేసి హత్యకు గురి చేయడం చాలా ఆందోళనకార విషయమని ముకేశ్ చంద్రకర్ హత్యను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి ఆయన హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకొవాలని వారు డిమాండ్ చేయారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైతన్య మహిళా సంఘం తరపున హాజరైన శ్రీదేవి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై తన గళం విప్పుతూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభుత్వ అధికారులు, గుత్తేదారుల అవినీతిని బయటపెట్టిన ముఖేష్ చంద్రకర్ హత్యను ప్రజాస్వామిక వాదులుగా ఖండించాల్సిన అవసరం ఉందని ఇలాంటి చర్యలు ముందు ముందు జరగకుండా ప్రభుత్వాలు ఫ్రీ ల్యాన్సర్ జర్నలిస్టుల కోసం రక్షణ చట్టం తీసుకురావాలని వారు మాట్లాడారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ ఆజాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికా విలేకరులపై దాడులు చేయడం దుర్మార్గమని, ఇది వాక్ స్వాతంత్రపు చట్టానికి విరుద్ధమని, రోడ్డు అభివృద్ధి పనులలో జరుగుతున్న కోట్ల రూపాయల అవినీతిని బయటపెట్టిన ముకేశ్ చంద్రకర్ ను హత్య చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అని, ముఖేష్ చంద్ర కర్ హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చర్యలు చేపడతామని వారన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ డెమొక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కామగొని శ్రవణ్ మాట్లాడుతూ దేశంలో పరిస్థితులను చూస్తుంటే ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతూన్న వారి పక్షాన ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడుతున్న జర్నలిస్టులను కాంట్రాక్టు గుండాలు అతికిరాతకంగా హత్య చేసిన సెప్టిక్ ట్యాంక్ లో పడివేసి గుర్తుపట్టలేనంతగా అతని మృతదేహాన్ని చిద్రం చేసిన అక్కడి ప్రభుత్వం కనీసం ఆయా దోపిడీ కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టకపోవడం చాలా సిగ్గుచేటని, ఇది చాలా దుర్మార్గమైన చర్యగా ఖండిస్తూ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ పై దాడి చేసిన ఆ అవినీతి గుండాలపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీఎఫ్ జిల్లా కోకన్వీనర్ విజయ్ కృష్ణ, విద్యార్థి నాయకులు మర్రి మహేష్, యాదగిరిలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, వాక్ స్వాతంత్రపు స్వేచ్ఛను కాపాడవలసిన అధికారులు, ప్రభుత్వ నాయకులు కాంట్రాక్టు దోపిడీదారులకు వత్తాసు పలుకుతూ ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతూ, హత్యలకు గురిచేస్తున్న ప్రభుత్వాలు స్పందించకపోవడం సిగ్గుచేటని వారన్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భువనేశ్వర్, అనిల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు