నవతెలంగాణ-కోదాడరూరల్
వ్యవసాయకార్మికసంఘం జిల్లా కార్యదర్శి మట్టపల్లి సైదులుపై పోలీసులు దాడి చేయడాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ముత్యాలు అన్నారు. సోమవారం పట్టణంలోని సుందరయ్యభవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోతె మండలం విభాలపురంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సైదులు, గోపాల్‌రెడ్డిపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండించాలని కోరారు. ఎస్సై మహేష్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పట్టణ నాయకులు లింగయ్య, రాములు, శ్రీను, సతీష్, కాటయ్య, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
పెన్‌పహాడ్: మోతె మండలం విభాలపురం గ్రామంలో వ్యవసాయ కార్మికసంఘం జిల్లాకార్యదర్శి మట్టిపల్లి సైదులుపై ఎస్సై మహేశ్ దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్టు సీపీఐ(ఎం) మండలకార్యదర్శి రణపంగ కృష్ణ తెలిపారు. మండలకేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వెంటనేలెస్సై మహేష్‌ను సస్పెండ్ చేయాలని కోరారు.
మునగాల : ప్రజా సంఘాల నాయకులు మట్టపల్లి సైదులుపై పోలీసులు చేసిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు కోరారు. మండలంలోని కక్కిరేణి గ్రామంలో పార్టీ గ్రామ శాఖ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని వారి పక్షాన పోరాటం చేస్తున్న వ్యవసాయ కార్మిక సం ఘం నాయకులపై పోలీసులు దాడులు చేయటం ఏమిటని ప్రశ్నించారు. మోతె మండలం విభళాపురంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని తెలిపారు. అవకతవకలను అరికట్టాలని అర్హులై న పేదలకు డబుల్ బెడ్ ఇళ్ళు కేటా యించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సైదులుపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు.ఈ సమావేశంలో శాఖ కార్యదర్శి నందిగామ సైదులు, సీనియర్ నాయకులు పోటు పుల్లయ్య,ఉపసర్పంచ్ రావులపెంట బ్రహ్మం, డీివైఎఫ్‌ఐ జిల్లాకమిటీ సభ్యులు వట్టెపు చిన్నసైదులు, ములకలపల్లి సైదులు,రావులపెంట వెంకన్న, నాగరాజు, లింగయ్య, పాల్గొన్నారు.
నేరేడుచర్ల:మోతె ఎస్సై మహేష్‌ను సస్పెండ్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారుమండంలోని పెంచికల్‌దిన్న గ్రామంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన మాట్లాడారు.