నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను ఖండించండి

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఢిల్లీలో రైతులపై కాల్పులు జరిపిన నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను ఖండించాలని ఐఎఫ్‌టియు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు తెలిపారు. శనివారం స్థానిక కొత్త బస్టాండ్‌ దగ్గర నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నాయకులు మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని పంజాబ్‌ హర్యానా రైతులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే హర్యానా సరిహద్దుల్లో రైతులపై భాష వాయువు, లబ్బర్‌ బుల్లెట్లతో గుండ్ల వర్షం కురిపించిందన్నారు. ఈ కాల్పుల్లో  శుభకరణ్‌ సింగ్‌ మరణించడం జరిగిందని,  ఈ మరణాలకు బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.మోడీ ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ప్రజా పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు సామా నర్సిరెడ్డి, అరుణోదయ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లె వెంకన్న , పిడిఎస్యు నాయకులు పుల్లూరి సింహాద్రి, ప్రగతిశీల ఆటో వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటే మురళి, అమాలి వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకులు హరి ప్రసాద్, సైదులు, శేఖర్, వెంకన్న ,లింగయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.