సీనియర్ జర్నలిస్టు చంద్రమౌళి దశదినకర్మలో జిల్లా మిల్లర్స్ అధ్యక్షుడి సంతాపం

నవతెలంగాణ –  హలియా
సీనియర్ జర్నలిస్టు, లెక్చరర్ కుకుడాల చంద్రమౌళి దశదినకర్మ లో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చిట్టిపోలు యాదగిరి హాజరై సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రమౌళి మరణం తీరని లోటు అని ఆయన అన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతోపాటు ఇంద్రసేనారెడ్డి, కరుణాసాగర్, నరేష్, చంద్రమౌళి కుటుంబ సభ్యులు కుక్కుడాల ఆంజనేయులు నరేష్, సాయి తదితరులు ఉన్నారు.