రామచంద్రు మృతికి సంతాపం 

నవతెలంగాణ -నకిరేకల్
మండలంలోని తాటికల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు చనగాని నగేష్ గౌడ్ తండ్రి రామచంద్రు అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దైద రవీందర్, సీనియర్ నాయకులు చామల శ్రీనివాస్ మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట గాదగోని కొండయ్య, మిర్యాల శేఖర్, సుధాకర్, వెంకటేష్, సైదులు, శ్రీను, మల్లయ్య, ఏకలవ్య, యం.డి యూసుఫ్, రాజశేఖర్ గౌడ్, పందిరి సతీష్ ఉన్నారు.