మృతుల కుటుంబాలకు పరామర్శ

Condolences to the families of the deceasedనవతెలంగాణ – కోహెడ
మండల కేంద్రంలో ఇటీవల పలు కారణాలతో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఆదివారం ఫ్యాక్స్‌ ఛైర్మన్‌ పెర్యాల దెవేందర్‌రావు పరామర్శించారు. బీఆర్‌ఎస్‌ గ్రామశాఖ ఉపాధ్యాక్షుడు తలారి నర్సయ్య తండ్రి పెద్ద పోషయ్య మృతి చెందడంతో పాటు గ్రామానికి చెందిన జనగాం పోషవ్వ, బండారి ప్రభాకర్‌ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను కలిసి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్‌ సీఈవో ముంజ మల్లిఖార్జున్‌, మాజీ ఎంపీటీసీ తిప్పారపు నాగరాజు, మాజీ సర్పంచ్‌ మంద రాజయ్య, ఆరె జగదీష్‌, వేల్పుల జాన్‌, బస్వరాజు రాజశేఖర్‌, తదితరులు ఉన్నారు.