ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహణ

Conduct of free cervical disease treatment campనవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని ముదేల్లి గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరము  ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి రవి మాట్లాడుతూ.. పశుఘన అభివృద్ధి సంస్థ వారు ఉచితంగా మందులు పంపిణీ చేశారని శిబిరంలో 20 పశువులకు గర్భకోష వ్యాధులకు రెండు కృత్రిమ గర్భధారణ 4 సాధారణ చికిత్స 20 నటలని వారిని మొత్తం 46 పశువులకు ఉచితంగా పశుఘన అభివృద్ధి ఆధ్వర్యంలో మందులు పంపిణీ చేశామని ఆయన అన్నారు.  రైతులకు ఇటువంటి ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అలాగే మీ పశువులు ఈ మూడు నెలల్లో ఎదకు వస్తాయి. కావున వాటిని గమనించి మీకు అందుబాటులో ఉన్న గోపాల మిత్రుల ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించినట్లయితే మంచి మేలు జాతి దూడలు పుడతాయి అదీకంగా పాలు ఇస్తాయని రైతులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశు వైద్య సహాయకులు సురేష్ , సూపర్వైజర్ తిరుపతి,గోపాల మిత్రాలు  ప్రసాద్, రాములు, రమేష్  సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.