ఎల్.ఎల్.బి ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మూట్( మోడల్) కోర్ట్ పరీక్షల నిర్వహణ..

నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లోని న్యాయ కళాశాల ఎల్.ఎల్.బి చివరి సంవత్సరం  విద్యార్థులకు మూట్( మోడల్) కోర్ట్ పరీక్షలు న్యాయ శాస్త్ర, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా పరిరక్షణలో మంగళవారం నిర్వహించారు. ఈ మూట్ కోర్ట్ పరీక్షలకు నిజామాబాద్ జిల్లా సీనియర్ న్యాయవాది శ్రీరామ గౌడ్ ఎక్స్టర్నల్ గా  ఎగ్జామినర్ గా,  డాక్టర్ బి స్రవంతి ఇంటర్నల్ ఎగ్జామినేర్గా హాజరయ్యారు. ఈ ముట్ కోట్ పరీక్షల కొరకు భారతీయ సమ న్యాయ చట్టం 2023 మరియు దాని ప్రభావం విద్యా వ్యవస్థ పై ఎలా ఉందో  వివరించారు.ప్రైవేట్ విద్యాసంస్థలు ఈ చట్టాన్ని సవాళ్లు చేస్తూ తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో  రిట్ పిటిషన్ వేసినట్లు ఇరుపక్షాల వాదన ప్రతి వాదనలు  ప్రాక్టికల్ గా నిర్వహించారు.ఈ వాద ప్రతివాదనలో ఇంతకు ముందు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను పరిశీలించడం, నిర్ధారించడం జరిగింది.ప్రాక్టికల్ గా జరిగిన చర్చలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్, విభాగ పతి డాక్టర్ కే ప్రసన్న రాణి, అకాడమిక్ కన్సల్టెంట్ డాక్టర్ ఎం నాగజ్యోతి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా హాజరైన రామ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల కేసులపై అన్నీ కోణలపై క్షుణ్ణంగా పరిశీలించాలని న్యాయస్థానాలలో ఏ రకంగా వాదనలు వినిపించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా  ఇటీవలే అమెరికా  దేశ పర్యటనలో భాగంగా అక్కడి సుప్రీంకోర్టు, జిల్లా కోర్టు పని విధానాలను విద్యార్థులకు వివరించారు.