ఏప్రిల్ 13న పద్మశాలి హాస్టల్ ఎన్నికల నిర్వహణ కోసం తీర్మానం చేయడం జరిగిందని రచ్చ మురళి తెలిపారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ నిజామాబాద్ సభ్యులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రచ్చ మురళి మాట్లాడుతూ.. 22 జనవరి రోజున పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ యొక్క ఎన్నికలు జరపాలని సమావేశం ఏర్పరిచి ఎన్నికల అధికారిగా దాసరి నర్సింలు, ఎన్నికల కో కన్వీనర్ యాదగిరిని ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు. 13 ఏప్రిల్ ఆదివారం రోజున 2025 నాడు ఎన్నికల జరుపుటకు తీర్మానించడం జరిగింది దానికి ఎన్నికల కమిటీ దాసరి నరసింహులు, యాదగిరి ని నియమించడం జరిగింది. ఈ యొక్క ఎన్నికలు చాలా సంవత్సరాలు నుంచి పెండింగ్ లోనే చాలా చర్చలు జరిపిన తర్వాత పూర్తి అధికారాన్ని మరి వీరిద్దరికీ అప్పగిస్తూ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని నిష్పక్షపాతంగా ఉండాలని సూచించారు. ఎన్నికల అధికారులుగా ఇట్టి విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ సమావేశంలో పద్మశాలి కుటుంబ సభ్యులు సత్యపాల్, పుులగం మోహన్, గణేష్, అబ్బన్న, శంకర్, నారాయణ, గంగరాజు, శ్రీనివాస్, వెంకట్, మురళి, దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.