పద్మశాలి రాజకీయ యుద్ధభేరి సభను కోరుట్లలో ఈనెల 13న నిర్వహణ..

నవతెలంగాణ -కంటేశ్వర్

రాజ్యాధికార సాధన కోసం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆద్వర్యంలో పద్మశాలి రాజకీయ యుద్దభేరి సభను కోరుట్లలో ఈ నెల 13న నిర్వహిస్తున్నట్టు నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి పుల్గం హన్మాండ్లు చెప్పారు.మంగళవారం జిల్లా పద్మశాలి సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హన్మాండ్లు మాట్లాడుతూ.. కోరుట్లలో నిర్వహిస్తున్న పద్మశాలి రాజకీయ యుద్దభేరి సభకు జిల్లాలోని పద్మశాలీలు రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్దయెత్తున తరలి వచ్చి ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం మండల గ్రామ పద్మశాలి సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. రాజ్యాధికార సాధన కోసం పద్మశాలీలు సంఘటితంగా ముందుకు సాగాలని సూచించారు. శాసనసభలో పద్మశాలీ ఎమ్మెల్యేలుంటే పద్మశాలీల సమస్యలు పరిష్కరమవుతాయని హక్కులు సాదించుకోవచ్చన్నారు. మీడియా సమావేశంలో నగర పద్మశాలీ సంఘం అద్యక్షులు గుజ్జేటి వెంకట్ నర్సయ్య, కోశాధికారి కైరంకొండ విఠల్, సహాయ కార్యదర్శి బింగి మోహన్, జాతీయ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కోశాధికారి సిలివేరి గణేష్, జిల్లా అధ్యక్షుడు బెజుగం నర్సింలు, పద్మశాలి సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతల గంగాదాస్, ప్రతినిధులు కొండ గంగాచరణ్, రాజేందర్, దాసు తదితరులు పాల్గొన్నారు.