ప్రజాపంథా ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌లో సదస్సు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు రూపంలోకి మారుతున్నదని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయల సుభాష్‌చంద్రబోస్‌ ఏడో వర్ధంతి సందర్భంగా ‘ఫాసిస్టు ప్రమాదంలో భారతదేశ ప్రజాస్వామ్యం’అనే అంశంపై శుక్రవారం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హైదరాబాద్‌లో సదస్సును నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌, వీక్షణం సంపాదకులు వేణుగోపాల్‌, భార్గవ, రమేష్‌ పట్నాయక్‌, దేవి, సతీష్‌చందర్‌ తదితరులు ప్రసంగిస్తారని వివరించారు.