జాతీయ రహదారి భూసేకరణపై సమావేశం

నవతెలంగాణ – ముత్తారం
జాతీయ రహదారి నెంబర్‌ 163జీ నిర్మాణం కోసం చేస్తున్న భూసేకరణలో భాగంగా మంగళవారం ముత్తారం మండలంలోని ముత్తారం, ఓడెడు గ్రామాల్లో మంథని ఆర్డీఓ వి.హనుమ నాయక్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఓడెడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓడెడు గ్రామంలో భూసేకరణకు సంబందించి అవార్డు విచారణ నిర్వహించారు. ఈ సమావేశంలో భూమికి నష్టపరిహారం ఆర్‌ఎఫ్సిటి ఎన్‌ఏ ఆర్‌ఆర్‌ 2013 చట్టం ప్రకారం చెల్లించడం జరుగుతుందని ఆర్డీఓ తెలిపారు. ఈ సమావేశంలో రైతులు అడిగిన ప్రశ్నలకు ఆర్డీఓ నివఅతి చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ పి.సుమన్‌, మాజీ సర్పంచ్‌ సిరికొండ బక్కారావు, ఎంపిటిసి పోతిపెద్ది కిషన్‌ రెడ్డి, ఆర్‌ఐ భవానీ ప్రసాద్‌, శ్రీధర్‌, భూ నిర్వాసితులు, ప్రజలు పాల్గన్నారు.