నవతెలంగాణ – కామారెడ్డి
ఈ నెల 9న వికలాంగ విద్యార్థుల నిర్ధారణ కొరకు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వికలాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీకి అర్హులైన వారిని గుర్తించేందుకు ఈ నెల 9న అలింకో ముంబై వారి ఆధ్వర్యంలో నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిబిరానికి జిల్లాలోని ప్రతి మండలంలో ఉన్నటువంటి 18 సంవత్సరాల లోపు వికలాంగులు ఈ శిబిరానికి హాజరుకావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ విద్యార్థులకు వినికిడి యంత్రాలు, వీల్ చైర్, మూడు చక్రాల సైకిల్, చంక కర్రలు, కృత్తిమ అవయవాలు, అందులకు అవసరమైన కేస్, అదే విధంగా 16 నుండి 18 సంవత్సరాలు గల విద్యను అభ్యర్థిస్తున్న అర్వత కలిగిన శరీరక వికలాంగులకు మూడు చక్రాల స్కూటర్, అర్వత కలిగిన దృష్టిలోపం కలిగిన వారికి స్మార్ట్ మొబైల్ లు అందించడానికి నిర్ధారణ చేస్తారన్నారు. ఈ శిబిరంలో పాల్గొనే దివ్యాంగులు తమతోపాటు ఆధార్ కార్డు, సదరం ధృవపత్రము, ఆదాయపత్రము లేదా రేషన్ కార్డు జిరాక్స్ పత్రము, రెండు ఫోటోలు, యూ డి ఐ డి కార్డు జిరాక్స్ వెంట తీసుకొని రావాలని సూచించారు. ఈ శిబిరానికి హాజీర అయ్యే పిల్లలకు తోడుగా తల్లి లేదా తండ్రి రావచ్చని వారికి రానుపోను బస్సు చార్జీలు, భోజనం సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా సహిత విద్యా సమన్వయకర్త కృష్ణ చైతన్య తెలిపారు. ఈ సదవకాశాన్ని వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరేఏదైనా సమాచారం, వివరాల కోసం సహిత విద్య సమన్వయకర్త కృష్ణ చైతన్య ఫోన్ నెంబర్ 800807090 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు.