నవతెలంగాణ- సదాశివపేట
సదాశివపేటలోని ఐబీలో బుధ వారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కా ర్యక్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసు కుంది. ప్రొటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ నేతలను స్టేజ్‌పైకి ఎలా పిలుస్తారని బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కార్యక్రమం నిర్వహిస్తుంటే బీఆర్‌ఎస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 100 రోజులలో ఆరు పథకాలను అమలు చేసి తీరుతుందన్నారు. బీఆర్‌ఎస్ నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చూసి నిద్ర పట్టడం లేదని ధ్వజమెత్తారు. ఇందులో అధికారుల లోపం ఉందన్నారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. బీసీ బంధు చెక్కుల హోల్డ్‌లో పెట్టారన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల జయప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.