ఎంఎన్‌వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్‌ని హీరో శివాజీ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ‘ఈ చిత్రం టైటిల్, కాన్సెప్ట్ చాలా బాగున్నాయి. ఈ చిత్రం కచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది’ అని అన్నారు.”మచిలీపట్నం పెడన పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర సింహ భాగం చిత్రీకరణ జరిగింది. యూత్ ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన మా చిత్రం ద్వారా చాలా మంది నూతన నటీనటులు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా ఐదు జంటల మధ్య జరిగే అద్భుతమైన సంఘర్షణలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే ట్విస్టులు ఈ సినిమాలో ఉన్నాయి. అంతే కాకుండా, సెకండ్ హాఫ్‌లో శివుడి మీద ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను రక్తి కట్టిస్తాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని దర్శక, నిర్మాత ఎంఎన్‌వి సాగర్ తెలిపారు.