రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న, రైతు భరోసా, ఇందిరమ్మ మహిళ భరోసా,ఇందిరమ్మ ఇళ్ళు,రేషన్ కార్డుల పథకాలను మంజూరి చేయగా కొత్త పేట గ్రామంలో ఆదివారం లబ్ధిదారులకు మంజూరి పత్రాలను అందజేశారు. అసలైన లబ్ధిదారుల ను ఎంపిక చేయకుండా అనర్హుల ను ఎంపిక చేసి వారికి మంజూరి పత్రాలు ఎలా ఇస్తారు అని గ్రామస్తులు నిలదీశారు. అదేవిదంగా కోలకని రామవ్వ, పిట్టల వజ్రవ్వ ను ఎందుకు ఎంపిక చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామ కమిటీ తమకు అన్యాయం చేసిందని అధికారుల పై మండి పడ్డారు. దీంతో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ మల్లేశం, తహశీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ ప్రదీప్ జోక్యం చేసుకొని మీకు లబ్ది చేయడం మా బాధ్యత అని సర్దిచెప్పడం తో సమావేశం సజావుగా సాగింది.