
– పోలీస్ బందోబస్తు మధ్య గ్రామసభ నిర్వహణ
నవతెలంగాణ – కామారెడ్డి ( బిబిపేట్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు పొందేందుకు లబ్ధిదారులను గుర్తించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని అర్హులను కాదని, అనఅర్హులను గుర్తించారాని బిబిపేట మండలం, జనగామ గ్రామంలో గురువారం జరిగిన ప్రజా పాలన గ్రామసభలో అధికారులను ప్రజలు నిలదీశారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించరు. అందులో భాగంగా గతంలో దరఖాస్తు చేసుకున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఈ రెండు మంజూరు వాటిపైనే ప్రజలు అర్హులను వదిలి అనారులకు ఇచ్చారంటూ సభలో గొడవకు దిగడంతో బిబిపేట్ మండల ఎస్సై ప్రభాకర్ పోలీసులతో వచ్చి ఎలాంటి గొడవ జరగకుండా చూశారు. గ్రామంలో ఉద్యోగం ఉన్న ఇంటికి రేషన్ కార్డు ఇచ్చారని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని అంతేకాకుండా ఒకే ఇంట్లో ఇద్దరికి, ముగ్గురికి మంజూరు రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు కాలిపోతే దరఖాస్తు చేసుకుంటే నష్టపరిహారం రాలేదని, ఇల్లు మంజూరు కాలేదని సదర్ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మరొకరు తమ పురాతన ఇంటిని కూల్చివేసుకుని ప్రస్తుతం ఇంటి నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని అలాంటి మాకు ఇల్లు మంజూరు కాకపోవడం ఏంటన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసే సమయంలో గ్రామంలో గల వారితోనే సర్వే చేయించారని వారికి తమ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో తెలియదా అన్నారు. ఈమధ్య బి ఆర్ ఎస్ ప్రభుత్వం పంచిన డబల్ బెడ్ రూమ్ వచ్చిన వారికి సైతం ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, ఎంపిక ఏ ప్రక్రియ జరిగిందని చెప్పాలని గ్రామ ప్రజలు పట్టుబట్టారు.ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారికి సైతం రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని ప్రజలు పేర్కొనడంతో అధికారులు వారు పేరు చెప్పాలని సూచించారు.లబ్ధిదారులను ఎంపిక చేసే సమయంలో గ్రామంలో గల ఉద్యోగులతోనే సర్వే చేయించారని వారికి తమ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో, ఉద్యోగాలు లేని వారు, బీదవారు తెలియదా అనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఎవరైనా అరువులు ఉంటే వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని అలాంటి వారినీ గుర్తించి వారికి న్యాయం చేయడం జరుగుతుందన్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మార్పులు చేయండి..
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని గుంట, రెండు గుంటల భూమి ఉన్న ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అర్హులు కాదని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు.. తమకు నాలుగు గుంటల భూమి ఉంటే అందులో ఎన్ని వేల పంట పండిస్తామని తమ మనీ ఎలా పోషించుకుంటామని పలువురు పేద రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మీయ భరోసాలో మార్పులు చేసి తమలాంటి నాలుగుంటలు, ఐదుగుంటలు, 10 గుంటలు ఉన్న రైతులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ సత్యనారాయణ, గ్రామ ప్రత్యేక అధికారి శృతి, గ్రామ కార్యదర్శి కాశి కళ్యాణ్, బిక్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, బేబీ పేట మండలం మాజీ వైస్ ఎంపీపీ కప్పిర రవీందర్ రెడ్డి, కారోబార్ సాయికిరణ్, మాది సర్పంచ్ మాట్ట శ్రీనివాస్, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.