– పూజలు అందుకుంటున్న వనదేవతలు
– మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం నీమా నాయక్ తండా పంచాయతీ పరిధిలోని పొట్టిచెలిమ వద్ద వెలసిన గిరిజనుల ఆరాధ్య దైవాలుగా కొలుస్తున్న, సమ్మక్క సారక్క జాతరకు శుక్రవారం భక్తుల కొలహలం గా మారింది.నియోజకవర్గం లో ప్రజలు విశేషంగా దర్శించే సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర కొండాకోనా పరవశించేలా సంభరాలు జరుగనున్నాయి.నాగార్జున సాగర్ నియోజకవర్గానికి కకుంభమేళాగా పేరుగాంచిన ఈ జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుండడం తో భక్తులతో శోభాయమాణంగ మారింది. ఈ జాతరకు నల్గొండ, గుంటూరు, పల్నాడు జిల్లాలనుంచి భక్తులు అధికసంఖ్యలో భక్తులు వస్తున్నారు.పవిత్రమైన కృష్ణానది ఒడ్డున పొట్టిచేలిమ వద్ద సమ్మక్క, సారక్క, నాగులమ్మ దేవతలకు ఘనంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు.భక్తులు వన దేవతలకు పసువు, కుంకుమ, లతో బెల్లం, బియ్యం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించు కుంటున్నారు.శుక్రవారం ఆలయం వద్దు జాతరలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ జాతర ను ఆర్గనైజర్ గుంజా కృష్ణం రాజు, దేవాలయం అధ్యక్షులు నాగపురి లక్ష్మి రామస్వామి, బోర్డు ఆఫ్ ట్రస్ట్ నాగపురి వెంకట పతి, కమిటీ సభ్యులు వెంకట్ పతిరాజు, సాయి, సంభశివ, ప్రియ దర్శిని, విజయ, లహరి,నమిత,మహా లక్ష్మి వారి ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సావాలు జరుగుతున్నాయి.