విజయ్ కనిష్క, గరిమ చౌహన్ జంటగా సిఎల్‌ఎన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హనుమాన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కలవరం’. పూజా కార్యక్రమాలతో శనివారం చదలవాడ శ్రీనివాసరావు, సి.కళ్యాణ్ ఈ సినిమా ప్రారంభించారు.
దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి మాట్లాడుతూ, ‘ఈ కథ చెప్పిన వెంటనే నచ్చి, మనం ఈ సినిమా చేస్తున్నాం అని నిర్మాత శోభ రాణి చెప్పారు. హీరో విజరు కనిష్కకి కూడా ఈ కథ బాగా నచ్చడంతో, ఈ రోజున ఇలా గ్రాండ్‌గా ప్రారంభించాం’ అని తెలిపారు.
‘మా నాన్న విక్రమం తమిళంలో ఎన్నో సినిమాలు దర్శకత్వం వహించారు. తెలుగులో ‘వసంతం, చెప్పవే చిరుగాలి’ వంటి సినిమాలు కూడా దర్శకత్వం వహించారు. శోభ, డైరెక్టర్ హనుమాన్ మంచి ప్యాషన్‌తో ఈ కథని నాకు వినిపించారు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని హీరో విజరు కనిష్క చెప్పారు.
కథా రచయిత శశాంక్ పి మాట్లాడుతూ, ‘కథ వినగానే ఈ సినిమా మనం చేస్తున్నామని సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ శోభారాణికి ప్రత్యేక కతజ్ఞతలు’ అని తెలిపారు. ”కలవరం’ అనే టైటిల్ ఈ సినిమాకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఈ చిత్రంలో 70 మంది ఆర్టిస్టులు ఉన్నారు. వారి గురించి త్వరలోనే వివరాలు విడుదల చేస్తాం. ఇందులో లవ్‌స్టోరీతోపాటు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్, అలాగే థ్రిల్లర్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అనవ్నీ అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తాయి’ అని నిర్మాత శోభారాణి చెప్పారు. ఈ చిత్రానికి డిఓపి : వెంకటేష్, మ్యూజిక్ : వికాస్ బాడిస, ఎడిటర్ : శిరీష్ ప్రసాద్.