అభినందనలు : సీఎం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారీ వర్షాల్లో, విరిగిన చెట్ల కొమ్మల మధ్య, ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న విద్యుత్‌ ఉద్యోగులు, పోలీసు, మున్సిపల్‌ సిబ్బందికి ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం జరక్కుండా, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో సమర్థ వంతంగా పనిచేస్తున్నారని ఆదివారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలక్కుండా, పక్కా ప్రణాళికతో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది కష్టం సత్ఫలితాలను ఇస్తుందని తెలిపారు.