చంద్రయాన్‌ 3 విజయం పట్ల సంబరాలు

నవతెలంగాణ-కోహెడ
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ బుధవారం చంద్రయాన్‌ 3 విజయవంతంగా కక్ష్యలోకి వెళ్ళడం పట్ల ఆటోయూనియన్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద టపాసులు పేల్చి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్‌ మండల అధ్యక్షుడు ముంజ రమేష్‌ మాట్లాడుతూ చంద్రుని దక్షిణ ధృవంపై సురక్షితంగా దిగేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజులలో మరిన్ని పరిశోధనలు చేసి భారతదేశ సత్తా ఛాటాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్‌ నాయకులు కొంకటి చంద్రయ్య, పొన్నాల చంద్రమౌళి, గూడ స్వామి, గాలిపెల్లి బాబు, మాజీ ఎంపీటీసీ తిప్పారపు నాగరాజు, ఉపసర్పంచ్‌ యాద అశోక్‌, కందాల రవిందర్‌, వలస సుభాష్‌, మంద మల్లేషం, జగదీష్‌, తదితరులు పాల్గోన్నారు.