ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు అభినందనల వెల్లువ

నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజవర్గం టీడీపీ ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్‌ కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు శనివారం విజయవాడ నగరం హౌటల్‌ రెడ్‌ ఫాక్స్‌లో హైదరాబాద్‌ వై.ఎఫ్‌.సి.ఏ.జంట నగరాల అధ్యక్షులు దంపనబోయిన శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శెట్టిబలిజ కులస్తుల సంక్షేమానికి కషి చేస్తానని తెలిపారు. మీ అందరి ఆశీర్వాదంతోనే తనకు మంత్రి పదవి వచ్చిందని కులస్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో శెట్టిబలిజ కులస్తులను బీసీి(బి) నుండి ఓసీ జాబితాలోకి చేర్చడం వల్ల తమ కులస్తులకు అన్ని విధాలుగా తీరని అన్యాయం జరుగుతుందన్నారు. బీసీ(బి)లోకి చేర్చే విధంగా తన వంతు కషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో శెట్టిబలిజ కులస్తుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నట్టు వై.ఎఫ్‌.సి.ఏ.జంట నగరాల అధ్యక్షుడు దంపనబోయిన శ్రీనివాస్‌, సంఘం పెద్దలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో జంటనగరాల శెట్టిబలిజ సంఘం (వై.ఎఫ్‌.సి.ఏ) ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన ప్రసాద్‌ కోశాధికారి చింతపల్లి దుర్గాప్రసాద్‌, సాంస్కతిక కార్యదర్శి యండ్ర లోకేష్‌, కార్యవర్గ సభ్యులు కుడుపూడి శ్రీనివాసరావు, లీగల్‌ సెల్‌ అధ్యక్షులు అడ్వకేట్‌ కే.ఎల్‌.బి.కుమార్‌, బొక్క రాంనరేష్‌, పూర్వపు అధ్యక్షులు దొమ్మేటి సత్యనారాయణ, శెట్టిబలిజ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (టీ.ఎస్‌.డబ్ల్యూ.ఏ) ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన రమేష్‌, కోశాధికారి చింతపల్లి శ్రీనివాస్‌ రావు,వనస్థలిపురం అధ్యక్షులు పి.వి.వి.సత్యనారాయణ, మోతినగర్‌ అధ్యక్షులు కుడుపూడి శ్రీనివాసరావు, కూకట్‌పల్లి అధ్యక్షులు చెల్లుబోయిన కొండలరావు, కుడిపూడి మోహన్‌ రావు, బొక్క ప్రసాద్‌, రాయుడు గణపతి, కరువు శ్రీనివాసరావు, చిట్టూరి త్రిమూర్తులు, లీగల్‌ టీమ్‌ సభ్యులు, గవర్నింగ్‌ బాడీ సభ్యులు, సంఘ పెద్దలు పాల్గొని శుభాభినందనలు తెలిపారు.