అమెరికా కెప్టెన్‌ అనికకు సత్కారం

Congratulations to Captain America Anikaహైదరాబాద్‌: ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌లో పాల్గొనే అమెరికా మహిళల జట్టు కెప్టెన్‌ కొలన్‌ అనిక రెడ్డి, లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్మడి శాన్విని సెంటర్‌ ఫర్‌ క్రికెట్‌ (సీఎఫ్‌సీ) ఎక్స్‌లెన్స్‌ అకాడమీ నిర్వాహకులు కె.భరణి, చీఫ్‌ కోచ్‌ జగదీష్‌ రెడ్డి కలిసి ఘనంగా సత్కరించారు. అమెరికా అండర్‌-19 క్రికెట్‌ జట్టులో కీలక ప్లేయర్లుగా ఉన్న ఈ తెలుగు మూలాలు గల క్రికెటర్లు కొద్ది నెలలుగా హైదరాబాద్‌లోని ఐసీసీ లెవల్‌ 3 కోచ్‌ జగదీష్‌ రెడ్డి దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. ఈ ఇరువురికి సీఎఫ్‌సీ నిర్వాహకులు భరణి క్రికెట్‌ కిట్లను ప్రదానం చేశారు. భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థానాలకు చేరాలని భరణి ఆకాంక్షించారు.