
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరే్ : తెలంగాణ రాష్ట్రంలో గౌడ కల్లు గీత కార్మిక కుటుంబాలలోని అట్టడుగు స్థాయిలో ఉన్న చింద్రమైన కుటుంబాలకు. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో నష్టపోయిన జీవితాలకు తమ వంతు పాత్ర గా సహకారం అందించి ఆర్థిక భరోసా కల్పిస్తు ఉపాధి అవకాశాలను చూపిస్తున్న కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థ వారికి కల్లు గీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు అభినందనలు తెలియజేశారు. గురువారం రోజున భువనగిరి మండలం ముస్త్య లపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బట్టల షాపు ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి మండలం ముస్త్యలపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు గీత కార్మికుడు ఈరగాని శ్యామ్ గౌడ్ఇటీవల వృత్తి చేస్తూ ప్రమాదవశాత్తు మోకుజారి తాటి చెట్టు పై నుండి క్రిందపడి అ్కడికక్కడే మృతి చెందగా , అతనికి భార్య ఈరగాని మమత ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వారికి ఎలాంటి ఆస్తులు లేకపోవడంతో పిల్లల పోషణ భారంగా ఉన్న పరిస్థితులు తో కూలినాలి పని చేసుకొని ఇబ్బందులతో కుటుంబం భారంగా మారడం తో ఈరగాని మమత చాలా బాధలు పడుతున్న సందర్భం ఆమే పరిస్థితి చూసి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థ బాధ్యలు నాతి శ్రీనివాస్ గౌడ్, స్థానిక వాలంటర్ నాతి గణేష్ గౌడ్ లను సంప్రదించగా వారు వెంటనే స్పందించి ఆమె ఉపాధి అవకాశం కోసం 30 వేల రూపాయలు బట్టల షాప్ కు కావలసిన వస్త్రాలను ఇప్పించడం జరిగిందనారు. కాన సంస్థ వారి సహకారంతో ఏర్పాటుచేసిన బట్టల షాపును ముస్త్యా లపల్లి గ్రామంలో ఈరగాని మమత ఇంటిలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయ రాములు నూతన బట్టల షాప్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం భువనగిరి మండల అధ్యక్షులు పాండాల మైసయ్య, జిల్లా నాయకులు రంగ కొండల్, ముస్తాలపల్లి గ్రామ పెద్దలు గౌడ నాయకులు ఈర గాని నరసింహ, గంధమల్ల వెంకటేష్, గంధమల శ్రీనివాస్, గంధమల్ల భాస్కర్, వడ్డేమాన్ రాములు, మొటికెల జాంగిర్, పచ్చిమట్ల వెంకటేష్, పచ్చిమట్ల యాదగిరి. జంపాల నరేష్, మొటికల హేమలత, పసునది మంజుల, వడ్డే ఆగమ్మ, పచ్చిమట్ల మహేశవరి లు పాల్గొన్నారు.