తెలంగాణ రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డితో కలిసి సింగపూర్, దావోస్ పర్యటనలు దిగ్విజయంగా పూర్తిచేసుకుని రూ.1.79 లక్షల కోట్లు పెట్టుబడులను రాష్ట్రానికి సాధించుకుని తీసుకవచ్చిన రాష్ట్ర ఐటీ,మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అభినందనల వెల్లువ నిర్వహించారు. మంగళవారం బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పలువురు కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.వీరిలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు, మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.