ఎమ్మెల్యే ధన్ పాల్ కు ఘన సత్కారం

నవతెలంగాణ – కంటేశ్వర్
హైదరాబాద్, కర్మాన్ ఘాట్ శ్రీ లక్ష్మి కన్వెన్షన్ లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అమరావది లక్ష్మీనారాయణ అధ్యక్షతన శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కి అభినందన సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్టంలో ఆర్యవైశ్య నుండి ఏకైక ఎమ్మెల్యే గా ఇందూర్ నుండి ధన్ పాల్ గెలవడం చాలా సంతోషమని, ఈ వేదికగా వారిని సన్మానించుకోవడం గర్వాంగా ఉందని మాజీ మంత్రివర్యులు టీ. జీ వెంకటేష్  అభినందించారు. అనంతరం ముఖ్య అతిధిగా గా పాల్గొన్న ధన్ పాల్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు అంటే సేవకు మారు పేరని, హిందూ ధర్మాన్ని రక్షిస్తూ సమాజసేవ చేయడంలో ముందుంటారన్నారు. ఆర్యవైశ్య లో కూడా వెనుకపడిన వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఏ ఒక్క నాయకులు పట్టించుకోలేదు కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఎన్నికలు రాగానే మనం గుర్తుకొస్తాము. గతంలో కేసీఆర్, కేటీఆర్ వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఆ హామీ మాటలకే పరిమితం అయిందని, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ప్రజలు మనలాంటి నిస్వార్ధంగా పని చేసే నాయకులని కోరుకుంటున్నారని తను ఇందూరులో గెలవడానికి తన తల్లితండ్రుల పేరుతో చేస్తున్న సేవ కార్యక్రమాలవల్లె అని, మనలో ఉన్న మేధావులు, యువకులు ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనీ, పెద్దలు రోషయ్య  చెప్పినట్టు మనం ఏకతాటిమీదకి రావాలని,ఒకటికావాలని పిలుపునిచ్చారు,మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, లాల లాజపతి రాయి, లాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని చరిత్రలో నిలిచిపోయే విదంగా మన ప్రయాణం ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలొ మాజీ రాజ్య సభ సభ్యులు గిరీష్ సంఘీ చికోటి ప్రవీణ్,జితేందర్,శర్మ గారు,కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా , నాగోళ్ళ లక్ష్మీనారాయణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.