
నవతెలంగాణ – భువనగిరి రూరల్
భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో సీపీఐ(ఎం) తరుపున ఐదు సంవత్సరాల క్రితం సర్పంచ్ గా గెలిచి గ్రామాన్ని అందరి సహాకారంతో అన్ని రంగాలలో అభివృద్ధి పరిచి ఆదర్శవంతంగా నిలిచిన సర్పంచి ఎదునూరి ప్రేమలత మల్లేశం కు సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ అన్నారు. ఆదివారం సిపిఎం అనాజిపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో సర్పంచ్ ఇంటి దగ్గర 5 సంవత్సరాల పదవిని విజయవంతంగా పూర్తి చేసి పదవి విరమణ చేసిన సందర్భంలో సర్పంచ్ ఏదునూరి ప్రేమలతను సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సర్పంచ్ భర్త ఎదునూరి మల్లేష్ ను ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సింహ్మ పాల్గొని మాట్లాడుతు ఏదునూరి ప్రేమలత మల్లేష్ గ్రామ సర్పంచ్ గా ఐదు సంవత్సరాలలో ప్రజలందరి సహకారంతో ఎలాంటి అవినీతికి తావు లేకుండా గ్రామాన్ని అన్ని రంగాలలో ప్రధానంగా రోడ్లు, విద్యుత్తు, మంచినీటి, డ్రైనేజీ లాంటి మౌలిక సౌకర్యాలు అన్ని వార్డులలో కల్పించడంలో ముఖ్య భూమిక పోషించారని తెలియజేశారు. మేజర్ గ్రామపంచాయతీ అయినా అనాజిపురంలో ప్రజల ఆరోగ్య విషయంలో కానీ, పేద విద్యార్థులందరికీ ప్రభుత్వ విద్యను అందించడానికి స్కూలును అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి తమ నెల వారి గౌరవ వేతనం కూడా తీసుకోకుండా స్కూలు అభివృద్ధికి ఆ డబ్బులను ఖర్చు చేయడం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. సీపీఐ(ఎం) పార్టీ తరఫున గెలిచి ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందించాలని, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండుకుంటూ ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ ప్రజలందరి మన్నలను పొందిన ఆదర్శవంతమైన సర్పంచి ప్రేమలతగారని వారి స్ఫూర్తితో ప్రజలందరూ రానున్న కాలంలో మరో మారు సీపీఐ(ఎం)కు అవకాశాలు ఇవ్వవలసిందిగా కోరారు. రానున్న కాలంలో ప్రేమలత ప్రజా సమస్యల పరిష్కారం కోసం తగిన సలహాలు సూచనలు ఇస్తూ పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, మాజీ సర్పంచి బొల్లెపల్లి కుమార్, గ్రామ కమిటీ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్, ఏరియా కార్యదర్శులు ఎదునూరి వెంకటేష్, ముచ్చపతి బాలయ్య, గ్రామ నాయకులు కడారి కృష్ణ, బొల్లెపల్లి కిషన్, బొల్లెపల్లి పరమేష్, పిట్టల వెంకటేశం, ఎండి అఫ్జల్, మైలారం శివ, ఎండి ముస్తఫా, గంగనబోయిన లక్ష్మి, గంగనబోయిన రాజు, తోటకూరి మల్లేశం, వెంకటస్వామి లు పాల్గొన్నారు.