ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం

నవతెలంగాణ -రుద్రంగి
రుద్రంగి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రో చ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్. ఆధ్వర్యంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొమిరె శంకర్,మాట్లాడుతూ కార్తిక పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర మహోత్సవం 3 రోజుల పాటు ఉంటుందని అధికారం అనగా ఈరోజు స్వామివారి కళ్యాణం సోమ వారం రోజున అన్నదానం మంగళవారం రథోత్సవం కార్యక్రమం ఉంటుందని ఇట్టి కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.జాతరలో పాల్గొనే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అని తెలిపారు.