తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్గా నేరెళ్ల శారద పదవి బాధ్యతలు చేపట్టినందున సోమవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాలు అందజేసిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.