మైక్రో ఆర్టిస్ట్ కు అభినందనల వెల్లువ..

నవతెలంగాణ – బాల్కొండ
మండల కేంద్రంలోని ఆదర్శ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని తన నైపుణ్యంతో అందరినీ అబ్బుర పరుస్తుంది. నల్లూరు గ్రామానికి చెందిన  బర్కం అన్సిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ విద్యార్థిని  ఇండియా మ్యాప్, జాతీయ పతాకం, 75వ హ్యాపీ రిపబ్లిక్ డే అని చిన్నపాటి అక్షరాలతో నువ్వు లపై లిఖించింది. అక్షరాలను చదవాలన్న, చూడాలన్న మైక్రో లెన్స్ ద్వారా మాత్రమే సాధ్యం. తన తండ్రి బర్కం నరసయ్య కూడా మైక్రో ఆర్టిస్ట్ అని, తండ్రి వద్ద నేర్చుకొని లిఖించానని అన్సిక తెలిపింది. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఆదర్శ కళాశాలలో ప్రిన్సిపాల్ శంకర్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అన్సిక ను అభినందిస్తూ ప్రశంసించారు.