నూతన అధికారులకు అభినందనలు

నవతెలంగాణ – హలియా

అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన హాలియా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సతీష్ రెడ్డికి  మున్సిపల్ కమిషనర్ మున్వర్ కి నవతెలంగాణ దినపత్రిక తరఫున స్థానిక విలేకరి నరేష్  కలిసి శుభాకాంక్షలు తెలియజేయడమైనది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రిక ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా ఉండాలని వారు అన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు మాకు సమాచారం అందించాల్సిందిగా వాటిని పరిష్కరించే దిశగా  మేము చర్యలు తీసుకుంటామని అన్నారు.