నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఎన్నికల బదిలీలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం నుండి బదిలీపై వచ్చిన డిఆర్ డిఓ శాఖ అధికారిగా మదు సూదన్ రాజు, ఖమ్మం నుండి బదిలి పై వచ్చిన జడ్ పి. సీఈఓ గా వి వి అప్పారావు లు అలాగె ఖమ్మం నుండి బదిలీపై వచ్చిన జెడ్ పి డిప్యూటీ సి ఈ ఓ శిరీష లు బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సి హెచ్ ప్రియాంక ను మర్యాద పూర్వకంగా కలిసి, పుష్ప గుచ్చాలు అందజేశారు.ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ గారు మాట్లాడుతూ నూతన అధికారులందరికి శుభాకాంక్షలు తెలుపుతూ అధికారులు అందరు కలిసి జిల్లా అభివృద్ధి కి అహర్నిశలు కృషి చేయాలని, అర్హులైన అందరికి సంక్షేమ పథకాలు అందించటం కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని జిల్లా అదనపు కలెక్టర్ అన్నారు.