ఘరానా మోసగాడిని అరేస్ట్ చేసిన పోలీసులకు అభినందనలు..

– కోటపటి నర్సింహా నాయుడు..
నవతెలంగాణ -డిచ్ పల్లి

గతేడాది డిసెంబర్ లో డిచ్ పల్లి ఆర్కె ట్రావెల్స్ పేరుతో వందలాది మంది దగ్గర కోటి రూపాయలకు పైగా వసూలు చేసి పారిపోయిన గల్ఫ్ ఏజెంట్ షేక్ బషీర్ ను ఎట్టకేలకు డిచ్ పల్లి పోలీసులు వారం రోజుల క్రితం అరెస్ట్ చేసి రిమాండుకు పంపించిన డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కస్పరపు కృష్ణను గురువారం డిచ్ పల్లి పోలీస్టేషన్లో ‘ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక’ అధ్యక్షులు కోటపాటి నర్సింహనాయుడు బషీర్ చేతిలో మోసపోయిన వారితో కలిసి అభినందించి సిఐ కు ధన్యవాదాలు తెలిపారు. షేక్ బషీర్  ఒక్కొక్కరి దగ్గర నుండి 25 వేలకు పైగా 400 మంది దగ్గర కోటి రూపాయలకు పైగా వసూలు చేసి ఆంధ్రలో ఆస్తులు కొని అమాయకులను మోసగించాడు. షేక్ బషీర్ ను పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని, షేక్ బషీర్ కు రిమాండుకు పంపించినప్పటికీ  బెయిల్ పై విడుదలయ్యే అవకాశముంది. దింతో బాధితులు ఇప్పటికే అనేక పోలీస్టేషన్లలో కేసులు పెట్టామని దరఖాస్తు చేసుకున్నారు. వాటన్నింటిపై రికవరీ నమోదు చేసి బషీర్ ను ప్రీవెన్షన్ డిటెన్షన్ (పీడీ) కింద అరెస్ట్ చేసి బాధితులకు ఇవ్వవలసిన డబ్బులను రికవరీ అయ్యేంత వరకు విడుదల కాకుండా చూడాలని ఇటీవల జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని కోరగా మంత్రి స్పందించి ఇన్చార్జి సీపీతో మాట్లాడి షేక్ బషీర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించటంతో పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై వివిధ పోలీస్టేషన్ల అధికారులు స్పందించి కేసు బుక్ చేయాల్సిందిగా కోటపాటి నర్సింహా నాయుడు డిమాండ్ చేశారు.