
ఉప్పునుంతల మండల కేంద్రంలో ఉదయం 8 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా 4వ రోజు ఇంటింటికి తిరిగి విద్యా ప్రాముఖ్యతను,విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి చేపడుతున్న కార్యక్రమాలు ఇంగ్లీష్ మీడియంలో ఎఫ్ ఎల్ ఎం కార్యక్రమం ద్వారా టి ఎల్ ఎం తో కృత్యాధార విధానంలో అర్థవంతమైన బోధన,ప్రతి వారానికి,నెలకు స్లిప్ టెస్ట్ నిర్వహణ,వెనుకబడిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ, ప్రొజెక్టర్ ద్వారా డిజిటల్ తరగతులు,అబాకస్ తో స్పీడ్ మాథ్స్, స్పోకెన్ ఇంగ్లీష్,గురుకుల,నవోదయ పరీక్షలకు ప్రత్యేక తరగతులు,కంప్యూటర్ ఎడ్యుకేషన్,లైబ్రరీ పీరియడ్, ప్రభుత్వం అందిస్తున్న వసతులు ఉచితంగా పాఠ్య పుస్తకాలు,వర్క్ బుక్ లు, రెండు జతల యూనిఫాంలు,అల్పాహారంలో రాగి జావ,మధ్యాహ్న భోజనం,ప్రతి సంవత్సరం గురుకుల సీట్లు సాధించడాన్ని వివరిస్తూ పిల్లలను మన ప్రభుత్వ బడిలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరడం జరిగింది. ఇప్పటి వరకు 20మంది విద్యార్థులు పాఠశాలలో కొత్తగా చేరారని హెచ్ఎం లక్ష్మీ నారాయణ తెలిపారు. ఉపాధ్యాయులు బాలమణి, శ్రీనివాసులు, వెంకటేష్ లు పాల్గొన్నారు.