– ప్రజాపంథా జిల్లా కార్యవర్గ సభ్యులు నూపా భాస్కర్
నవతెలంగాణ-ములకలపల్లి
సంబురాలు సరే మా భూముల ఆకాంక్షల మాటేమిటి అని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి సభ్యులు నూపా భాస్కర్ అన్నారు. శుక్రవారం మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో తెలంగాణ ప్రజల దీక్ష దివాస్ సభ నిర్వహించిన అనంతరం బైక్ ర్యాలీ నిర్వహిస్తూ తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. రాష్ట్రం ఏర్పడి దశాబ్దమవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నదని, సంబరాలు సరే, మరి మా భూముల పట్టాల మాటేమిటి? మా నిరుద్యోగ భృతి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, నీళ్లు, నియామకాలు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవ ఏ మేరకు సాధించుకున్నామని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కల్లూరి కిషోర్ పోతుగంటి లక్ష్మణ్, మండల కార్యదర్శి కొర్సా రామకృష్ణ, తిమ్మంపేట ఎంపీటీసీ నూప సరోజిని, రాచన్నగూడెం పంచాయతీ సర్పంచ్ కోర్స గణపతి, ఎస్‌డిఎల్‌సి నాయకులు బండారి నాగేంద్రబాబు, నాగేశ్వరావు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : తెలంగాణ సిద్ధించి దశాబ్ద కాలం అయిన ప్రజా ఆకాంక్షలు అమరుల స్వప్నం నేటికీ నెరవేరలేదని తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి దుర్వినియోగం చేస్తున్నారని సిపిఐ ఎంఎల్ ప్రజాపందా రాష్ట్ర నేతలు రాయల చంద్రశేఖర్, గుమ్మడి నరసయ్య, చండ్ర అరుణ, ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుమ్మడి అనురాధ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దీక్ష దివాస్ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్రజాపంథా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం ఇల్లందు పట్టణం చంద్ర కృష్ణమూర్తి విజ్ఞాన భవన్‌లో నాయిని రాజు అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.