నవతెలంగాణ ఆర్మూర్: మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కాంతి హైస్కూల్లో నేడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు వందల సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు అభినందన పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి చదువుకు నాలుగు స్తంభాలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్, పిల్లలు అని, వీరు నలుగురు వారి బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో నెరవేరుస్తే విద్యార్థి విజయవంతంగా తన విద్యను పూర్తి చేసుకొని, భవిష్యత్తులో ఎన్నో ఘనవిజయాలను సాధించేందుకు బాట ఏర్పడుతుందని తెలియజేశారు. పాతిక సంవత్సరాలుగా యాజమాన్యంతో సహకరించిన తల్లిదండ్రులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు వారి పిల్లల పురోగతి మరియు వారి కార్యచరణ గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. వారి పిల్లల విద్యా పురోగతి గురించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.