పదోన్నతి పొందిన ఉపాధ్యాయునికి అభినందన సభ…

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని బి ఎన్ తిమ్మాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రచ్చ మల్లికార్జున్  అధ్యక్షత న జరిగిన ఉపాద్యాయుల పదోన్నతి బదిలీలు, అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న భువనగిరి మాజీ సింగిల్విండో ఛైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి హాజరై,  మాట్లాడారు.  విద్యార్థులకు మంచి చదువులు నేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో  ఉపాద్యాయుల కృషి ఎంతగానో ఉంటుందని,వారికి పాఠశాలలో అనేక రకాలుగా పాటలు బోధించి మంచి చెడులు గురించి నేర్పించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చడానికి అధ్యాపకుల కృషి మారువలేది అని అన్నారు. మా పాఠశాలలో మంచి బోధన అందించి మా గ్రామ పదవ తరగతి విద్యార్థులను మండలంలో మొదటి  స్థానం రావడానికి కృషి చేసిన ఉపాద్యాయుల సేవలు మారువలేనివని, వృత్తి రీత్యా ఉపాద్యాయులకు బదిలీలు తప్పవని,బదిలీపై వెళ్తున్న వారిని మరియు కొత్తగా వచ్చిన ఉపాద్యాయులను సన్మానించారు.తదనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎడ్ల సత్తి రెడ్డి ని ఉపాద్యాయుల బృందం ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపిటిసి ఉడుత శారదా ఆంజనేయులు యాదవ్, హై స్కూల్ చైర్మన్ ఉడుత కవిత రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు బోడ విద్యాసాగర్,ఉపాద్యాయులు యాకుబ్ చారి, బిట్ల అరుణ గాఫర్, లింగేశ్వర్ రావు, వెంకటేశ్వర్లు, షాహిన్ బేగం, నిర్మల, మాజీ స్కూల్ చైర్మన్ ఉడుత మహేందర్ పాల్గొన్నారు.