
నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని జేతురాం తండా, రావుల తండా నుండి పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం బిఆర్ఎస్ పార్టీలో చేరగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి వారిక కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన అభివృద్ధిని, చేసిన సేవను గుర్తించుకొని బిఆర్ఎస్ పార్టీలో పలువురు కార్యకర్తలు చేరుతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తమ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల నాయకులు తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, లేతకుల రంగా రెడ్డి, లేతకుల మధుకర్ రెడ్డి, బిల్లా వెంకట్ రెడ్డి, లేతకుల సుధాకర్ రెడ్డి, నేతవత్ కిషన్, గుగులోత్ రవి, శ్రీధర్, మన్సుర్, సంతోష్, రవి, సుమన్, రమేష్, వీర్, రవి తదితరులు పాల్గొన్నారు.