– ప్రచారంలో దూసుకుపోతున్న కసిరెడ్డి నారాయణరెడ్డి
– ఆమనగల్, కడ్తాల్ మండలాల్లో విస్త్రుత ప్రచారం
నవతెలంగాణ-ఆమనగల్
కల్వకుర్తి అసెంబ్లీలో కాంగ్రెస్ హవా జోరుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఆమనగల్ కడ్తాల్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో, గిరిజన తాండాల్లో సీడబ్ల్యూసీ సభ్యులు డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏఒక్కటి పూర్తి చేయని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఆయా ప్రభుత్వ శాఖలతో పాటు విద్యారంగంలో లక్షల సంఖ్యలో ఖాళీలు ఉన్న వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన ప్రభుత్వాన్ని సాగనంపాలని ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఎన్‌ఎస్ యూఐ ఆధ్వర్యంలో కడ్తాల్ మండలంలోని కర్కల్ పహాడ్ గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, మండల అధ్యక్షులు జగన్, బిచ్యా నాయక్, ఎన్‌ఎస్ యూఐ మండల అధ్యక్షులు శాబుద్దీన్, జిల్లా కార్యదర్శి మణికంఠ రెడ్డి, కష్ణయ్య, స్కైలాబ్, అశోక్, సత్యం, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.