
నవతెలంగాణ డిచ్ పల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ జాహుర్ పేర్కొన్నారు. అదివారం అయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. దేశంలోని ఎం రాష్ట్రం లో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ కులగలన చేపట్టిందని గత కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కులాల వారీగా లెక్క తేల్చేసి వివరించాడం జరిగిందని ఆయన అన్నారు.బీసీలకు రానున్న రోజుల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ సీట్లు రిజర్వేషన్ పరంగా కేటాయించే విధంగా ప్రకటించి బిసి లకు ఇతర కులాలకు పేద్ద పిట వేస్తుందని త్వరలో జరుగనున్న జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేసి విజయ దుందుభి మోగించడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి నాయకత్వంలో తిరుగులేని పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు పెద్దపీట వేయడానికి సహకరించిన సీఎం, ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే విజన్ కలిగిన నాయకులని వారి హయాంలో నిజామాబాద్ రూరల్ అబివృద్ధి లో ముందుంటుందని అశాభావం వ్యక్తం చేశారు.ఇప్పటికే రూరల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నిదులను మంజూరు చేసినట్లు డాక్టర్ జాహుర్ పేర్కొన్నారు.