– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు చేశాక ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీని లేకుండా చేయాలనీ, కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ నిర్ణయించుకున్నాయని విమర్శించారు. ఢిల్లీలో బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారనీ, అందుకే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజరు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను విమర్శించడం లేదని చెప్పారు. లగచర్లలో అన్ని పార్టీల వారున్నారని స్పష్టం చేశారు.