
– రాముడి పేరుతో ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తున్న బీజెపీ
– రాష్ట్రంలో రెండంకెల సీట్లలో గెలుస్తాం బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్
నవతెలంగాణ – కోహెడ
అసత్య హామీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తెచ్చిన పథకాలకే డబుల్ చేసి అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. అలాగే ప్రజా అభివృద్ధి పథకాలను తీసుకువచ్చింది బీఆర్‌ఎస్ పార్టీనేని అలాంటి పార్టీకే ప్రజలు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అగష్టు 15లోగా రైతుల రుణాలను మాఫీ చేస్తానంటున్నారని అదంతా బూటకమేనని ఆ రోజున మళ్ళీ జనవరి 26 అంటూ కాలం వెళ్ళదీస్తారని జోష్యం చెప్పారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రజలను మోసం చెసే వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినేనన్నారు. ఇప్పటికే ప్రజా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. మిడ్‌మానేర్‌ను పట్టించుకోకపోవడంతోనె కరువు ఏర్పడిరదని ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువేనన్నారు. బీజెపీ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ ఎంపీగా తనను గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నారని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు. శ్రీ రాముడి పేరుతో ఎన్నాళ్ళు కాలం వెళ్ళదీస్తారని, మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు దండుకుంటున్నారన్నారు. నేను ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజలకు పలు అభివృద్ధి పనులను చెసేందుకు చొరవ తీసుకున్నానన్నారు. మరోమారు ఎంపీగా గెలిపిస్తే అభివృద్ది చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ ఛైర్మన్ పేర్యాల దెవేందర్‌రావు, మాజీ జెడ్పీటీసీ పొన్నాల లక్ష్మణ్, మాజీ సర్పంచ్ మంద రాజయ్య, పార్టీ మండల అధ్యక్షుడు పెరుగు నరేందర్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు జాలిగాం శంకర్, సీనియర్ నాయకులు గవ్వ వంశీధర్‌రెడ్డి, కొయ్యడ పర్శరాములు, పోలవేని కుమారస్వామి, వేల్పుల నారాయణ, వేల్పుల జాన్, తదితరులు పాల్గొన్నారు.