నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం బాగేపల్లి గ్రామంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాలను తెలంగాణ ప్రజలకు అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని ఆయన వివరించారు. గృహ జ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 2 యూనిట్లు ఉచిత విద్యుత్తు, ఏకకాలంలో రెండు లక్షల రైతుల రుణమాఫీ, వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, నిరుద్యోగ యువకులకు ప్రతినెల 4000 రూపాయలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.