నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం కూనేపల్లి గ్రామంలో మాజీ ఎంపీటీసీ నీరడీ సాయిలు, శ్రీనివాస్ గౌడ్ ల ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. 6 గ్యారంటీ పథకాలను వారికి వివరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డిని చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దేవిదాస్, మాజీ సర్పంచ్ జంగం గంగయ్య, లక్ష్మణ్, సాయిలు, శ్రీనివాస్ పోతున్న, మోతిరామ్ ధన్ గ్ తదితరులు పాల్గొన్నారు.